Site icon HashtagU Telugu

JNU: మాంసాహారం చిచ్చు… శ్రీరామనవమి రోజున కొట్టుకున్న జేఎన్ యూ విద్యార్థులు

JNU

JNU

దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ( జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుంది. రామనవమి కావడంతో జేఎన్ యూలోని కావేరి మెస్ లో నాన్ వెజ్ వడ్డించరాదని ఏబీవీపీ కార్యకర్తలు హుకుం జారీ చేసినట్లు జేఎన్ యూ కార్యకర్తలు ఆరోపణలు చేశారు.
అయితే క్యాంపస్ లో శ్రీరామనవమి పూజలకు జేఎన్ ఎస్ యూ కార్యకర్తలు అడ్డుతగినట్లుగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం తీవ్ర దాడులకు దారి తీసింది.

పెద్ద సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు.