Recalling 1 Million Cars:1మిలియన్ బెంజ్ కార్లు వెనక్కి…కారణం ఇదే..!!!

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారుదారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Mercedes Benz

Mercedes Benz

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారుదారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. SUVసిరీస్ లోని పలు కార్ల మోడల్స్ లో బ్రేక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావడంతో ఈ మోడళ్లను వెనక్కి తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. పలు మోడల్స్ కు చెందిన పది లక్షల కార్లను వెనక్కి తీసుకోనుంది.

లగ్జూరియస్ కార్ల పేర్లు అనగానే గుర్తుకువచ్చేది మెర్సిడెజ్ బెంజ్ కారు. జర్మనీకి చెంది టాప్ కార్ మేకర్స్ కంపెనీ. ఈ కంపెనీ బేసిక్ కారు ధర 50లక్షలకు పైగా ఉంటుంది. ఇక హైఎండ్ కార్ల ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. జర్మనీలోని స్టట్ గార్ట్ ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఈ కంపెనీ. ఈ మధ్యకాలంలో చిప్ షార్టేజ్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో సకాలంలో డెలివరీలు చేయలేకపోయింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ కార్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కార్ల బ్రేకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 2004 నుంచి 2015వరకు తయారైన వాటిల్లోని పది లక్షల కార్లను వెనక్కి తీసుకునేలా మెర్సిడెజ్ బెంజ్ త్వరలోనే ఆదేశాలను జారీ చేయనున్నట్లు జర్మన్ ఫెడరల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తెలిపింది. ML, GLస్పోర్ట్స్, యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్ క్లాస్ లగ్జరీ మినీవ్యాన్లను రీకాల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 9,93,0000ML,GL స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్ క్లాస్ లగ్జరీ మినీ వ్యాన్ లను విక్రయించింది. ఇందులో 70,000కార్లు ఒక్క జర్మనీలోనే అమ్ముడయ్యాయి. ఆథరైజ్డ్ డీలర్ల ద్వారా ఇప్పుడు వాటన్నింటినీ రీకాల్ చేయనుంది. బ్రేక్ బూస్టర్ లో సమస్యలు తొలగించిన తర్వాత వాటిని క్లయింట్లకు డెలవరీ చేస్తుంది. ఈ మూడు నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తాన్నీ ముగించేలా మెర్సిడెజ్ బెంజ్ ప్రణాళికలను రూపొందించుకుంది. mercedes is recalling one million cars worldwide

  Last Updated: 06 Jun 2022, 04:56 PM IST