Site icon HashtagU Telugu

Mehreen: ‘హనీ ఈజ్ ద డిఫరెంట్’

Mehareen

Mehareen

F2లోని హనీ అనే పాత్ర హీరోయిన్ మెహ్రీన్ కు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో మరిన్ని అవకాశాలను అందుకుంది. ఈ బ్యూటీలో మే 27న విడుదలకు సిద్దంగా ఉన్న F3 లోనూ అలరించనుంది.  ఎఫ్2లో బబ్లీ, చైల్డ్‌లాగా నటించిన మెహ్రీన్ ఎఫ్3లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం. ఎఫ్3లో మెహ్రీన్ మెచ్యూర్డ్‌గా కనిపిస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి ఎఫ్ 2లో ఆమె చేసిన పాత్ర కంటే వినోదాత్మకంగా ఉండేలా క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. మెహ్రీన్ కెరీర్‌లో ఇది బెస్ట్ కామిక్ రోల్ అవుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, సోనాల్ చౌహాన్ ఇతర హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.