Site icon HashtagU Telugu

Megastar: ఆచార్యకు ‘రాజమౌళి’ గండం.. ఆ సెంటిమెంట్ కంటిన్యూ!

Acharya

Acharya

ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేసిన హీరోల గురించి ప్రస్తావించాడు. ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేసిన హీరోలకు తదుపరి చిత్రాలేవీ హిట్స్ అందించలేకపోయాయి. కానీ ఆచార్య విషయంలో ఆ సెంటిమెంట్ ఉండదని, ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని అందరి సమక్షంలో తేల్చి చెప్పాడు. ఆ విషయంలో చిరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కానీ ఊహించని రితీలో ఆచార్య మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకోవడంతో మరోసారి రాజమౌళి సెంటిమెంట్ ను ఆచార్య కొనసాగించినట్టయింది.

హార్డ్‌కోర్ మెగా అభిమానులు కూడా ఆచార్య పట్ల నిరాశ చెందారు. కాలం చెల్లిన కథనం, పసలేని స్క్రిప్ట్ కారణంగా సినిమా ఆకట్టుకోలేకపోయిందనీ, చిరంజీవి, రామ్ చరణ్ సైతం ప్రభావం చూపలేకపోయారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరోల లుక్స్, భారీ స్టెటింగ్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ స్టోరీపై ఎందుకు ఫోకస్ చేయలేకపోయాడని ఫ్యాన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ లైన ‘ఆర్ఆర్ఆర్’ లో అల్లూరి సీతారామారాజుగా మెప్పించిన చరణ్.. ఆచార్యలో సిద్ధగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆర్ఆర్ఆర్ విడుదలైన నెల వ్యవధిలో ఆచార్య రిలీజ్ కావడం విశేషం. రాజమౌళి సెంటిమెంట్ కంటిన్యూ కావడంతో చరణ్ బలైపోయాడని టాలీవుడ్ టాక్.

Exit mobile version