Chiru In Godfather: మెగా ట్రీట్.. ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్‌ లుక్ లో చిరు!

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్‌ లుక్ తో ఆశ్చర్యపరిచారు.

Published By: HashtagU Telugu Desk
God Father

God Father

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్‌ లుక్ తో ఆశ్చర్యపరిచారు. ఆ పాత్రను పరిచయం చేయడానికి ఉద్దేశించిన చిత్రం యొక్క గ్లింప్స్ కూడా అద్భుతమైన స్పందనను పొందింది. ఇంకా అద్భుత‌మైన అప్‌డేట్ చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 21న సినిమా టీజర్ విడుదల కానుంది.

ఇక ఈరోజు విడుద‌ల‌చేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు, త‌ను బ్లాక్ షేడ్స్‌తో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో, సిటీ యొక్క రాత్రి దృశ్యాన్ని చూడవచ్చు. చాలా కాలం త‌ర్వాత చిరంజీవి తన కెరీర్‌లో ర‌ఫ్ అండ్ స్ట‌యిలిష్ లుక్‌లో కనిపించడం ఇదే తొలిసారి. గాడ్ ఫాదర్ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య తారాగణం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌గా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా గాడ్‌ఫాదర్‌ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

  Last Updated: 18 Aug 2022, 03:56 PM IST