Mega Job Mela: పాలకుర్తితో మెగా జాబ్ మేళా, 14, 205 మందికి ఉద్యోగావ‌కాశాలు

జాబ్ మేళాలో మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు స‌హా మొత్తం 80 వివిధ కంపెనీలు పాల్గొన్నాయి.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 03:10 PM IST

పాల‌కుర్తి : పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో డి.ఆర్.డి.ఎ, జనగామ మ‌రియు ఎర్ర‌బెల్లి చారిటబుల్ ట్ర‌స్టుల సంయుక్త ఆధ్వ‌ర్యంలో పాల‌కుర్తిలోని ఓ ఫంక్ష‌న్ హాలులో నిర్వ‌హించిన మెగా జాబ్ మేళా విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు స‌హా మొత్తం 80 వివిధ కంపెనీలు పాల్గొన‌గా, 14వేల 205 మందికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించడానికి అవ‌కాశాలు ఉండ‌గా, ఆయా ఉద్యోగాల కోసం వేలాదిగా ఉద్యోగార్థులు త‌ర‌లివ‌చ్చారు. కొడ‌కండ్ల‌, పాల‌కుర్తి, దేవరుప్పుల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల ఉద్యోగార్థుల‌కు ఈ మేళా నిర్వ‌హించ‌గా, ఆయా మండ‌లాల నుంచేగాక‌, జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి వేలాదిగా యువ‌తీ యువ‌కులు త‌ర‌లి వ‌చ్చి, ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఆయా కంపెనీల ప్ర‌తినిధులు ఓపిక‌గా ఇంట‌ర్వ్యూలు చేశారు. వారి అర్హ‌త‌లు, ఇంట‌ర్వ్యూల‌ను ఎదుర్కొన్న తీరుతెన్నులు, అవ‌కాశాల‌ను బ‌ట్టి అనేక మందికి ఈ మేళా ద్వారా ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు.

ఈ సంద‌ర్భగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఒక్కో కంపెనీ కౌంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళి, ఉద్యోగాల ఎంపిక‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఉద్యోగార్థుల‌తో ముచ్చ‌టించి, వారి అర్హ‌త‌లు, అవ‌కాశాల‌పై చ‌ర్చించారు. ఉద్యోగార్థుల‌కు, వారి వెంట వ‌చ్చిన స‌హాయ‌కుల‌కు భోజ‌నాలు పెట్టించారు. అలాగే ఆయా కంపెనీల‌కు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ రోజు జనగామ‌ జిల్లా లోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాది కల్పించాలని మెగా జాబు మేళా నిర్వహిస్తున్నాము. దీని వలన ఉపాధి అవకాశలు కలుగుతాయి. మొత్తం 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఈ కంపెనీల ద్వారా సుమారు 14 వేల 205 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ఇప్ప‌టికే ఇక్క‌డికిక్క‌డే కొంద‌రికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించారు. మిగ‌తా వాళ్ళ‌కి త‌ర్వాత కాల్ లెట‌ర్స్ పంపిస్తారు. ఫార్మా, ఐటి, బ్యాంకింగ్, హస్పిటల్ ఇండస్ట్రియల్, సాఫ్ట్ వేర్, మార్కెటింగ్, ఫైనాన్సు ఇలా అనేక రంగాల్లో అపోలో, ఎంపవర్ మెంట్ సర్వీసెస్, విప్రో, ఆమెజాన్, ప్లిప్ కార్ట్ లాంటి అనేక కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. జనగామ‌ జిల్లాకు చెందిన నిరుద్యోగులు మరియు ప్రత్యేకంగా పాలకుర్తి నియోజకవర్గం నిరుద్యోగులకు మంచి సదావకాశం. ఈ అవకాశాన్ని అనేక‌మంది ఉపయోగించుకున్నారు. కంపెనీలలో సెలెక్ట్ అయిన వారు సుమారు 12 వేల  నుండి 40 వేల వరకు జీతభత్యాలు ఉంటాయి.

Also Read: Shocking: ధన్‌బాద్ లో దారుణం.. 19 రోజుల్లో 50 నవజాత శిశువులు మృతి