Site icon HashtagU Telugu

Telugu Players: ఈ ఐపీఎల్ లో ఆడుతున్న ‘తెలుగు తేజాలు’ వీళ్ళే!

Cricket

Cricket

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌‌-2022 సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గతేడాది రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీపడనుంది. ఇరు జట్ల మధ్య వాంఖడే మైదానం వేదికగా సాయంత్రం 7: 30 గంటలకు ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ మొదలు కానుంది. అయితే ఆ క్యాష్ రీచ్ లీగ్ లో ప్రతీ సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు దుమ్మురేపేందుకు సిద్దమమ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 15వ సీజన్లో ఆడుతున్న తెలుగు తేజాలెవరో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2021 సీజన్లో సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు, యువ ఆటగాడు భగత్‌ వర్మ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు జట్టు తరఫున బరిలోకి దిగనుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్‌ భరత్‌, యువ క్రికెటర్ అశ్విన్ హెబ్బ‌ర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున బరిలోకి దిగనున్నారు. అలాగే హైద్రాబాద్ పేస్ గన్ మొహమ్మద్‌ సిరాజ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున బరిలోకి దిగనుండగా.. లెఫ్టార్మ్ స్పిన్న‌ర్ సీవీ మిలింద్ కూడా ఆర్సీబీ జట్టు తరఫునే ఆడుతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్‌ జట్టు తరఫున యువ క్రికెటర్లు తిలక్‌ వర్మ, రాహుల్ బుద్ధి బరిలోకి దిగనున్నారు.

Exit mobile version