Australia: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో..12 ఏళ్లకు రిటైర్మెంట్.. చిన్న వయసులోనే అరుదైన ఘనత?

నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది చదివింది నిజమే. అదేంటి చక్కగా స్కూల్లో చదువుకుంటూ,హోంవర్క్ చేసుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాల

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 03:08 PM IST

నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది చదివింది నిజమే. అదేంటి చక్కగా స్కూల్లో చదువుకుంటూ,హోంవర్క్ చేసుకుంటూ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన వయసులో ఆఫీస్ వర్క్ చేయడం ఏంటా అనుకుంటున్నారా. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్‌ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. దాంతో ఆమె తల్లి రాక్సీ జెసెన్కో ప్రోత్సాహం తోడైంది. రాక్సీ సిడ్నీలోని ఒక పీఆర్‌ కంపెనీ డైరెక్టర్‌. పిక్సీ చిన్న వయసులోనే పలు కంపెనీల ఉత్ప­త్తులకు మోడల్‌గా పనిచేసింది. పిక్సిస్‌ బౌ పేరిట హెయిర్‌ బౌస్‌ను అమ్మింది కూడా.

అయితే, కరోనా సమయంలో తన దశ తిరిగింది. 2021లో తల్లితో కలిసి పిక్సీస్‌ ఫిడ్జెట్స్‌ పేరిట ఆట బొమ్మల ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. అది సక్సెస్‌ కావడంతో ఆస్ట్రేలియా­లో పిక్సీ యంగెస్ట్‌ ఆంట్రప్రెన్యూర్‌గా మారిపోయింది. ఆమె నెల సంపాదన రూ. కోటికి పైనే. తనకు సొంత బెంజ్‌ కారు కూడా ఉంది. ఇన్నాళ్లూ ఆఫీసు వర్కుతో బిజీబిజీగా గడిపిన పిక్సీ ఇప్పుడు స్కూల్‌ హోంవర్కు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. తల్లి కూడా అదే చెప్పడంతో తన 12వ బర్త్‌డే రోజున రిటైర్‌ కానుంది. దీనికి తోడు పిక్సీ కుటుంబం ఆమె తండ్రి కర్టిస్‌ పనిచేస్తున్న సింగపూర్‌కు షిఫ్ట్‌ అవ్వాలని నిర్ణయించుకోవడంతో గత శనివారం ప్రీ బర్త్‌డే కం రిటైర్‌మెంట్‌ పార్టీని నిర్వహించారు.

సింగపూర్‌ థీమ్‌తో సాగిన ఈ పార్టీకి వచ్చినవాళ్లందరికీ రూ.4,112 విలువ చేసే స్కిన్‌కేర్‌ ఉత్పత్తులతో కూడిన బహుమతిని కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఆస్ట్రేలియా లగ్జరీ బ్యూటీ బ్రాండ్‌ ఎంకోబ్యూటీ స్పాన్సర్‌ చేసింది. అలాగే ఈ కర్టిస్‌ అనే అమ్మాయి 12 ఏళ్లకే తన బర్త్‌డే రోజున రిటైర్‌ అవుతోంది. కాగా పిక్సీ బర్త్‌డే కం రిటైర్‌మెంట్‌ డేట్‌ ఆగస్టు 16. ఆరోజున ఆ పిక్సీ సీఈఓ గా నుంచి తప్పుకుంటూ రిటైర్మెంట్ కాబోతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిన్న వయసుకే అంత తెలివితేటలు ప్రదర్శించిన ఆ చిన్నారి పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.