Site icon HashtagU Telugu

Uttar Pradesh: అప్పటివరకు ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా తిరిగిన యువకుడు.. కానీ అంతలోనే?

Uttar Pradesh

Uttar Pradesh

చావు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో అంచనా వేయడం, ఊహించడం చాలా కష్టం. అందుకే మానవ జీవితం నీటి మీద బుడగ లాంటిది అని అంటూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేసినవాళ్లు మరుక్షణమే మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా జాలిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అలాగే మరణించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో డ్యాన్సులు చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ సెకండ్ల విధిలోని వాళ్ళ ముందే ప్రాణాలు కోల్పయిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో కిద్వాయి నగర్ కు చెందిన జుబేర్ అనే 18 ఏళ్ళ యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే ఫ్రెండ్స్ తో కలిసి వీధుల్లో తిరుగుతూ సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలోని తన స్నేహితులతో కలిసి కొంత దూరం నడిచిన తర్వాత జుబేర్ ఒక్కసారిగా తుమ్ముతూ కుప్పకూలిపోయాడు. అయితే జుబేర్ కింద పడిపోతున్న సమయంలో అతని ఫ్రెండ్స్ అతని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కిందపడిపోయాడు. జుబేర్ ఒక్కసారిగా అలా కుప్పకూలడంతో వాళ్ళు షాక్ అయ్యారు.

వెంటనే అతని స్నేహితుల సహాయం కోసం కేకలు వేశారు. హుటాహుటిన అక్కడికి స్థానికులు చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దాంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కసారిగా కన్నీరుగా విలపించారు. అప్పటివరకు తమతో జాలీగా కలిసి తిరిగిన తమ స్నేహితుడు కళ్ళ ముందే అలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ బాధను అతని స్నేహితులను తట్టుకోలేకపోయారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.