Medicines: మార్కెట్లో మెడికల్ మాఫియా.. నకిలీ మందులతో జర జాగ్రత్త

  • Written By:
  • Updated On - April 11, 2024 / 08:45 PM IST

Medicines: మార్కెట్‎లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడుతోంది. ప్రముఖ బ్రాండ్స్‎కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్‎వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు.

ప్రముఖ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసిన్ లేదని.. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న మెడిసిన్ ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. దాదాపు 33 లక్షల విలువైన మెడిసిన్ సీజ్ చేసిన డీసీవి పేర్కొనింది. ఫేక్  మెడిసిన్స్ వాడకం ఆపేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. ఈ టాబ్లెట్స్ తో ఆరోగ్యానికి హానికరమన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సూచించారు. రిటెయిలర్స్ కూడా ఈ మెడిసిన్ ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మందులు తయారీ చేస్తున్న వారిపై డీసీఏ కేసు నమోదు చేసింది.

అసలైన ఔషధాన్ని, నకిలీ ఔషధాన్ని పక్కపక్కన పెట్టి పోల్చినప్పుడు కొన్ని తేడాలు గమనించవచ్చు. ముఖ్యంగా కంపెనీలు ప్యాకింగ్‌ మార్చినా.. నకిలీ ఔషధాలు పాత ప్యాకింగ్‌లోనే వస్తుంటాయి. పరిమాణం, రంగు, బరువు, క్వాలిటీ, డిజైన్‌లో తేడాలు కనిపిస్తుంటాయి. కంపెనీ పేరు లేదా ఉత్పత్తి పేరు లేదా అందులో ఉన్న రసాయనాల స్పెల్లింగ్‌ తేడాలు ఉంటాయి. తయారీ తేదీ, గడువు తేదీ, వంటివి ఔషధంతోపాటు బయటి కాటన్‌పై ఉండే వివరాలతో సరిపోల్చుకోవాలి.