Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!

మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల […]

Published By: HashtagU Telugu Desk
TSRTC

TSRTC

మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం MGBS నుంచి కూడా మేడారం కు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు, భక్తులు  https://tsrtconline.in లేదా #TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు ఆయన వెల్లడించారు.

  Last Updated: 11 Jan 2022, 02:59 PM IST