Site icon HashtagU Telugu

Medaram: మేడారం మహాజాతర ఎఫెక్ట్, ఆ ఐదు రోజులు విద్యాసంస్థలు బంద్

Medaram Jatara 2024

Medaram Jatara 2024

రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం నాలుగు వేలకు పైగా బస్సులను సిద్ధం చేసింది. ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలునే ఏర్పాటు చేయడం విశేషం. మేడారం జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం మేడారం జాతరకు వచ్చిన భక్తులతో జంపన్నవాగుకు ఇరువైపులా కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత భక్త జనంతో జంపన్నవాగు ప్రాంతం సందడిగా మారింది.
జంపన్న వాగులో పుష్కలంగా నీరు ఉండడంతో కొంతమంది భక్తులు జంపన్నవాగులో, మరి కొంతమంది భక్తులు జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తుల రాకను ద్రుష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.