Site icon HashtagU Telugu

GHMC Mayor : జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హైద‌రాబాద్ మేయ‌ర్

GHMC

GHMC

న‌గ‌రంలోని చార్మినార్‌ చుడీబజార్‌ జంతు సంరక్షణ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మేయర్‌ తెలిపారు. కుక్కల బోనుల సంఖ్యను పెంచాలని.. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి కుక్కల పట్టే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్టెరిలైజేషన్ ఆపరేషన్ల సంఖ్యను 45 నుంచి 70కి పెంచాలని మేయర్ ఆదేశించారు. వీధి కుక్కల థియేటర్లు, పునరావాస కేంద్రాలు, స్టెరిలైజ్డ్ డాగ్ సెంటర్లను ఆమె పరిశీలించారు. జంతువులకు ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందించాలని, కుక్కలకు వేడివేడి భోజనం పెట్టకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. నగరంలోని ఇతర జంతు సంరక్షణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మేయ‌ర్ విజయలక్ష్మి తెలియజేశారు.