Site icon HashtagU Telugu

Astrology : ఈ రాశివారికి నేడు ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో జాగ్రత్త అవసరం.

Astrology

Astrology

Astrology : బుధవారం రోజు చంద్రుడు రాశిలో సంచారం చేయనుండగా, ద్వాదశ రాశులపై పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు శ్రవణా నక్షత్రంలో మౌని అమావాస్య ఏర్పడనుంది. ఈ పర్వదినాన మకరరాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు కలిసే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. శివ యోగం, సిద్ధి యోగం కూడా లభించనుండడంతో కొన్ని రాశుల వారికి విశేషంగా శుభ ఫలితాలు రానున్నాయి. మేషం, మిథునం సహా ఇతర రాశులపై ఈ యోగాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి (Aries Horoscope Today)
ఈ రోజు కుటుంబంతో సమయాన్ని గడిపి సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందే అవకాశముంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
అదృష్ట శాతం: 66%
పరిహారం: శ్రీ శివ చాలీసా పఠించండి.

వృషభ రాశి (Taurus Horoscope Today)
ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశముంది. శాంతంగా వ్యవహరించండి.
అదృష్ట శాతం: 72%
పరిహారం: సూర్య నారాయణునికి అర్ఘ్యం సమర్పించండి.

మిధున రాశి (Gemini Horoscope Today)
వ్యాపారంలో మార్పులు చేయవచ్చు. ఒప్పందాలను సమీక్షించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో లాభదాయకమైన పరిణామాలు ఉండొచ్చు.
అదృష్ట శాతం: 84%
పరిహారం: చీమలకు పిండి పదార్థాలను తినిపించండి.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)
ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి మద్దతుతో లాభాలు పొందే అవకాశముంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు లభించొచ్చు.
అదృష్ట శాతం: 92%
పరిహారం: శ్రీమహావిష్ణువుకు పసుపు, బెల్లం సమర్పించండి.

సింహ రాశి (Leo Horoscope Today)
ఈ రోజు కుటుంబంతో సమయం ఆనందంగా గడుస్తుంది. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. సాయంత్రం స్నేహితులను కలవొచ్చు.
అదృష్ట శాతం: 93%
పరిహారం: సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీళ్ళు సమర్పించండి.

కన్య రాశి (Virgo Horoscope Today)
రాజకీయంగా అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సాయంత్రం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవొచ్చు.
అదృష్ట శాతం: 82%
పరిహారం: వినాయకుడికి దుర్వా సమర్పించండి.

తులా రాశి (Libra Horoscope Today)
వ్యాపారంలో లాభాలు అందుకోవచ్చు. అయితే ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం మంచిది కాదు. పిల్లల విద్యకు సంబంధించిన పనుల కోసం ప్రయాణం చేయవచ్చు.
అదృష్ట శాతం: 65%
పరిహారం: శ్రీ గణేశ చాలీసా పఠించండి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
ఈ రోజు ధైర్యంగా వ్యవహరిస్తారు. పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు. అన్ని పనులను ధైర్యంగా పూర్తి చేయండి.
అదృష్ట శాతం: 71%
పరిహారం: శివయ్యకు రాగి పాత్రలో నీరు సమర్పించండి.

ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శుభఫలితాలు పొందవచ్చు. వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు రూపొదించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
అదృష్ట శాతం: 73%
పరిహారం: గోమాతకు బెల్లం తినిపించండి.

మకర రాశి (Capricorn Horoscope Today)
సిద్ధి యోగం ప్రభావంతో పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు అవసరం. వ్యాపారులకు లాభాల అవకాశముంది.
అదృష్ట శాతం: 62%
పరిహారం: శ్రీ మహా విష్ణువును పూజించండి.

కుంభ రాశి (Aquarius Horoscope Today)
రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఆస్తి వివాదాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగాలలో పై అధికారుల సహాయం అవసరం అవుతుంది.
అదృష్ట శాతం: 69%
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

మీన రాశి (Pisces Horoscope Today)
కుటుంబ విషయాలలో మౌనంగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా మద్దతు అందుకోవచ్చు. పిల్లల పురోగతితో ఆనందం పొందుతారు.
అదృష్ట శాతం: 89%
పరిహారం: శ్రీ మహా విష్ణువుకు శనగపిండి లడ్డూలు సమర్పించండి.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన జ్యోతిష్య సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడినది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జ్యోతిష నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)

India vs England: మూడో టీ20లో భారత్‌ ఓటమి.. నిరాశ‌ప‌ర్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌