Site icon HashtagU Telugu

YSRCP : చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండిచిన వైసీపీ నేత‌లు.. రాజ‌కీయంగా ఎదుర్కొలేకే..?

Ysrcp

Ysrcp

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై వైసీపీలోనే భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు అరెస్ట్ అక్ర‌మ‌మంటూ ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు త‌మ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ వ‌ల్ల వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఉంటుంద‌ని అంటున్నారు. తాజాగా మంత్రాల‌యం వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించారు. కేడీసీసీ మాజీ ఛైర్మన్, దివంగత నేత మాధవరం రామిరెడ్డి కుమారులు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి చంద్రబాబును విడుదల చేయాలని నినాదాలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమ‌ని రాఘవేంద్రరెడ్డి, రామకృష్ణారెడ్డిలు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి బాధలో ఉన్నామన్న వారు తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడం బాధాకరమని.. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప.. అరెస్ట్ చేయడం పద్ధతి కాదని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీలో ఉంటూ చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు వెల్లడించారు.

Also Read:  BJP First List: 41 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల