Site icon HashtagU Telugu

Pokiri Massive Re-release: పండుగాడి దెబ్బకు థియేటర్స్ హౌస్ ఫుల్!

Pokiri

Pokiri

ప్రస్తుతం ప్రేక్షకులు లేక థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్న నేపథ్యంలో నేనున్నా అంటూ పోకిరి రూపంలో ఓ వచ్చాడు మహేశ్ బాబు. పోకిరి రీరిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయని మహేశ్ బాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరగనున్నాయి. బర్త్ డే ట్రీట్ గా మహేశ్ సూపర్‌హిట్  ‘పోకిరి’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అభిమానుల కోసం ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 20 థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు కేరళలో కూడా పోకిరి రీరిలీజ్ అవుతోంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. బుక్సింగ్ ఓపెన్స్ కొద్ది గంటల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాదాపు అన్నీ థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్టు టాలీవుడ్ టాక్. పండుగాడి దెబ్బకు మళ్లీ థియేటర్స్ కళకళలాడుతున్నాయని మహేశ్ అభిమానులకు సంబరాలకు సిద్ధమవుతున్నారు. పోకిరి ద్వారా వచ్చే ఆదాయం మహేష్ బాబు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టనున్నారు.

Exit mobile version