Amritpal Singh: పంజాబ్ లో హై అలర్ట్.. అమృత్ పాల్ సింగ్ కోసం ముమ్మర గాలింపు?

వారిసే పంజాబ్ డే పేరుతో నటుడు దీప్ సిద్దూ ప్రారంభించిన ఉద్యమ సంస్ధను కైవసం చేసుకుని ఖలిస్తాన్ అనుకూల

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 04:37 PM IST

వారిసే పంజాబ్ డే పేరుతో నటుడు దీప్ సిద్దూ ప్రారంభించిన ఉద్యమ సంస్ధను కైవసం చేసుకుని ఖలిస్తాన్ అనుకూల ఉద్యమానికి మద్దతుగా రెచ్చిపోతున్న అమృత్ పాల్ సింగ్ ను బంధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ జాయింట్ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు అమృత్ పాల్ సింగ్ కోసం వెతుకుతున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ను ప్రారంభించింది.

కాగా నిన్న అమృత్ పాల్ సింగ్ దొరికినట్లే దొరికి తప్పించుకున్న విషయం తెలిసిందే. దాంతో పంజాబ్లో ముమ్మరంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం భారీగా ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీసులను కూడా నిలిపివేశారు. అనుమానాస్పద ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అమృత్ పాల్ సింగ్ సన్నిహితులను బాడీగార్డ్లను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత పాల్ సింగ్ ఆర్థిక వ్యవహారాలు చూసే దల్జిత్ సింగ్ కూడా ఇందులో ఉన్నారు.

దల్జిత్ సింగ్ ని హర్యానాలోని గురుగావులు అరెస్టు చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం పంజాబ్ మొత్తం హై అలర్ట్ లో ఉంది. ఏడుగురు బాడీ గార్డ్ లను కూడా అరెస్టు చేశారు. జలంధర్ లో అతని ముగ్గురు సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అమృత్ పాల్ సింగ్ జలంధర్లో బైక్లో వెళుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు అయిన లవ్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయిన తర్వాత అతనిని విడిపించడం కోసం పెద్ద ఎత్తున అమృత్ పాల్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించాడు. ఘటనలు ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేశారు.