Domestic Manufacturing: పెరిగిన భారత ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతులు..9ఏళ్లలో 88శాతం…!!

గత తొమ్మిదేళ్లలో భారత్ నుంచి ఇతర దేశాల మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు 88శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • Written By:
  • Updated On - March 1, 2022 / 09:50 AM IST

గత తొమ్మిదేళ్లలో భారత్ నుంచి ఇతర దేశాల మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు 88శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2013-14లో యూఎస్డి 6600 మిలియన్ల నుంచి 2021-22 నాటికి యూఎస్డి 12,400మిలియన్లకు పెరిగింది. ఈ రంగంలో మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్ వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ , ఇండస్ట్రియల్ ఎలక్ట్రానికస్ అండ్ ఆటో ఎలక్ట్రానిక్స్ వంటి కీలక ఎగుమతులు ఉన్నాయి.

నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్..దేశంలోని కోర్ కాంపోనెంట్స్ అభివృద్ధికి, పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని స్రుష్టించడం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కు గ్లోబల్ హబ్ గా భారత్ నిలబడాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. లార్జ్ స్కేలో ఎలక్ట్రానికస్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఎలక్ట్రానిక్ కాంపెనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్ తయారీని ప్రోత్సహించే పథకం, మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ల కోసం 2ఐటీపీసీ స్కీమ్ లింక్డ్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సాహాన్ని అందించేందుకు ఇంకా అవసరమైన పర్యావరణ వ్యవస్థను స్థాపించేందుకు హార్డ్ వేర్ ప్రవేశపెట్టబడింది.

భారత్ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశ సరుకుల ఎగుమతి జనవరి 2021లో యూఎస్డీ 27.54 బిలియన్ల కంటే 23.69శాతం పెరిగి యూఎస్డీ 34.06 బిలియన్లకు చేరుకుంది. జనవరి 2020లో యూఎస్డి 25.85 బిలియన్ల కంటే 31.75శాతం పెరుగుదల నమోదు చేసింది. 2021-22లో భారతదేశ సరుకుల ఎగుమతి 2020-21 యూఎస్డీ 228.9 బిలియన్ల కంటే 46.53శాతం పెరిగి యూఎస్డీ 335.44 బిలియన్లకు చేరుకుంది. 2019-20లో యూఎస్డి 264.13 బిలియన్ల కంటే 27.0శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఎగుమతులు పెంచేందుకు కేంద్రప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సమయంలో ఎగుమతి రంగం ఎదుర్కొంటున్న అవరోధాలు, అడ్డంకులను తొలగించడంలో సహాయపడేందుకు మానిటరింగ్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. రిడెండెన్సీలు అండ్ కాలం చెల్లిన నిబంధనలను తొలగించేందుకు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పలు చట్టాలు సమీక్షబడుతున్నాయి.

ఎన్నో దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భారత్ లో ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేషనలైజేషన్ అండ్ డీక్రిమినలైజేషన్ ద్వారా భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టబడుతున్నాయి. విశ్వసనీయ సరఫరాదారుగా భారత్ గ్లోబల్ స్టాండింగ్ ను మెరుగపరిచేందుకు భారత్ ఎగుమతుల బ్రాండింగ్ విలువను పెంపోందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.