Site icon HashtagU Telugu

FIFA World Cup 2022: ఫిఫా స్టేడియం వద్ద అగ్నిప్రమాదం

Cropped (5)

Cropped (5)

ఫిఫా ప్రపంచకప్ 2022 జరుగుతున్న ఖతార్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాన్ విలేజ్ లుసేల్‌లో స్టేడియానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ ద్వీపంలో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని ఖతార్ అధికారులు ధృవీకరించారు. టోర్నమెంట్‌లో అనేక ఆటలను నిర్వహిస్తున్న లుసైల్ నగరంలో భాగమైన ఒక ద్వీపంలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.