Site icon HashtagU Telugu

Fire Accident: బాలానగర్ లోని ఓ అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident

New Web Story Copy 2023 07 10t093641.474

Fire Accident: హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాలానగర్ లోని ఓ అపార్టుమెంట్లో మంటలు ఎగసి పడటంతో స్థానికులు ఒక్కసారిగా అపార్ట్మెంట్ నుండి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే..

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బట్టల షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటన మరువకముందే మరో అగ్ని ప్రమాదం జరిగింది. బాలానగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్‌ స్పేస్‌ అపార్ట్‌మెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొంతసేపటికి పక్క ఫ్లాట్ కి మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టింది. ఈ లోపే ఆ ఫ్లాట్ లో భారీగా నష్టం జరిగిపోయింది. ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ వాసుల వాంగ్మూలాన్ని తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీస్ అధికారులు.

Read More: Bichagadu : బిచ్చగాడు సినిమాలో శ్రీకాంత్? అంతా ఓకే.. కానీ ఎందుకు క్యాన్సిల్ అయింది?