Site icon HashtagU Telugu

Hyderabad: బండ్లగూడలో భారీ పేలుడు

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్టలో భారీ పేలుడు సంభవించింది. రసాయన డబ్బా పేలుడు ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం బండ్లగూడలో షకీల్ అనే వ్యక్తి చెత్త సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాక్సును చూసి తెరిచాడు. అయితే అది కెమికల్ బాక్స్ కావడంతో తెరవగానే పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి షకీల్‌ ఒక్కసారిగా కిందపడిపోయాడు. పేలుడు శబ్ధంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. విషయం పోలీసులకు మరియు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన షకీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్