Site icon HashtagU Telugu

Kulgam : జమ్మూలో భారీ ఎన్ కౌంటర్…ఇద్దరు టెర్రరిస్టులు హతం..!!

Terrorists

Terrorists

జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు కాల్చి చంపాయి భద్రతా దళాలు. సెర్చ్ పార్టీపై జేఎం ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిని బట్ పోరాకు చెందిన హమ్మద్ షఫీ గని, టాకియా గోపాల్ పోరాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ వానీ అలియాస్ యావర్ గా గుర్తించారు.

కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కాసమాచారంతో భద్రతా బలగాలు…సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో అక్కడ దాక్కున్న టెర్రరిస్టులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుదాడి చేవారు. ఈ ఎన్ కౌంటర్ ల ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఏకే56, ఏకే 47 ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్, నాలుగు మ్యాగజైన్స్, ఒక పిస్టల్ మ్యాగజైన్ తోపాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version