Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ళ దాడి.. అసలేం జరిగిందంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి

  • Written By:
  • Updated On - March 27, 2023 / 06:20 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు శివమొగ్గ లోని ఆయన ఇంటిపై రాళ్ల దాడి చేశారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. యడియూరప్ప, సీఎం బసవరాజు బొమ్మై దిష్టి బొమ్మలు దహనం చేశారు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్‌ కోటాలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఒక్కసారిగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.

ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయమే ఈ నిరసనకు కారణం. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంజారా వర్గానికి చెందిన ప్రజలు యడియూరప్ప ఇంటికి ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ అంత కూడా ఉద్రిక్తత నెలకొంది. కాగా విద్య, ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను కొత్తగా వర్గీకరించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

అనుకున్న దాని ప్రకారమే ఎస్పీలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్లను అంతర్గత వర్గీకరణ చేస్తారు. ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా వర్గం నేతలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అంతర్గత వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ అగ్రనేత ఇంటిపై దాడికి దిగారు.