Site icon HashtagU Telugu

Khiladi: ఫిబ్రవరి 5న ‘ఖిలాడి’ నుంచి ‘క్యాచ్ మీ’ పాట

Khiladi

Khiladi

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఐదో పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన ఐదో పాట విడుదల కాబోతోందని మేకర్లు ప్రకటించారు.

క్యాచ్ మీ అంటూ సాగే ఈ పాటలో డింపుల్ హయతీ, ఫారిన్ డ్యాన్సర్లు సందడి చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో డింపుల్ హయతీ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.

Exit mobile version