చెన్నైలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. ఇది రేపటి నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది. తమిళనాడులో, చెన్నైలో సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,000 దాటింది. అత్యధిక కేసులు చెన్నై, చెంగల్‌పేట నుండి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 13,086 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 4,35,31,650 కి చేరుకున్నాయి.
Chennai : చెన్నైలో మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..?

Mask