Maruti Suzuki: మారుతి సుజుకీ నుంచి సీఎన్జీ కారు…రిలీజ్ ఎప్పుడంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎన్జీ వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది.

  • Written By:
  • Updated On - March 17, 2022 / 12:20 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎన్జీ వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకోని తయారీదారు సంస్థలు సీఎన్జీ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. స్వదేశి దిగ్గజ కారు బ్రాండ్ మారుతి సుజుకీ కూడా ఇఫ్పుడు సీఎన్జీ వాహనాలపై ద్రుష్టి సారించింది. తన అత్యంత పాపులర్ డిజైర్ మోడల్ను సీఎన్జీ వెర్షన్ లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. గతనెలలో మారుతి సుజకి సెలెరియా సీఎన్జీ వేరియంట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు మరికొన్ని సీఎన్జీ వెర్షన్లను ఆవిష్కరించే పనిలో బిజీగా ఉంది.

ఇక అతి తొందర్లోనే డిజైర్ సబ్ -కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వెర్షన్ను రిలీజ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. పలు రిపోర్ట్స్ ప్రకారం..కొందరు మారుతీ డీలర్లు..ఇప్పటికే డిజైర్ సీఎన్జీ బుకింగ్స్ ను తీసుకోవడం ప్రారంభించారు. కంపెనీ ఇప్పటికే తన షోరూమ్స్ లో డీలర్ శిక్షణను కూడా ప్రారంభించింది. గత నెలలోనే మారుతి సుజుకీ సెలెరియా వెర్షన్ విడుదల అయ్యింది. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో సీఎనజీ వెర్షన్ విడుదల చేస్తుండటం విశేషం.

ప్రస్తుతం భారత్ లో మారుతి డిజైర్ అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో సెడాన్ వేరియంట్ ఒకటి. ప్రతినెల 10,000కంటేఎక్కువ యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ కారు సబ్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది. డిజైర్ ప్రస్తుత మోడల్స్ కేవలం పెట్రోల్ ఇంజన్స్ తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 6.09 నుంచి రూ. 9.13లక్షల మధ్య ఉంది.

ఫిబ్రవరిలో మారుతీ మొత్తం 17,438 యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. డిజైర్ పెట్రోల్ వేరియంట్ గతేడాదితో పోల్చితే…46.5శాతం వ్రుద్ధిని సాధించింది. దీంతో డిజైర్ సీఎన్జీ వెర్షన్ ను ఆవిష్కరించాలని కంపెనీ భావిస్తోంది. ఇక డిజైర్ సీఎన్జీ వేరియంట్ 1.2 లీటర్,K12M VVT పెట్రోల్ ఇంజన్ తో సమానంగా సీఎన్జీ కిట్ తో వస్తుంది. ఇది 71bhp పవర్, 95Nm టార్క్ ప్రొడక్టు చేస్తుంది. పలు నివేదికల ప్రకారం…మారుతి సుజుకి త్వరలోనే స్విఫ్ట్, విటారా బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ, సీఎన్జీ వేరియంట్స్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.