Site icon HashtagU Telugu

Housewife Run With Minor: మైనర్ బాలుడితో వివాహిత పరార్!

Woman crime

Woman crime

హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన ఓ వివాహిత మైనర్‌ బాలుడితో పరారైంది. అయితే పోలీసులు పట్టుకుని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ తర్వాత 15 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. వివాహిత స్వప్నపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పిల్లల తల్లి స్వప్న, ఇంటి పక్కన ఉన్న తమ  కుమారుడిని కిడ్నాప్ చేసిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కుమారుడి సమాచారం అందిస్తే రివార్డు కూడా అందిస్తామని ప్రకటించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. పారిపోయిన మహిళ గుడివాడలో దొరికినట్టు తెలిసింది. అయితే  మైనర్‌తో జీవితాంతం గడిపేందుకు వివాహిత పారిపోయిందని సీఐ వెల్లడించారు.