Site icon HashtagU Telugu

AP Crime: భర్తతో విడాకులు.. రెండో పెళ్లి కానీ చివరికి అలా..?

Ss1kkkzb

Ss1kkkzb

తాజాగా నందిగామ పట్టణ శివారులో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు అనే మహిళ గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకుంది. నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్‌ ఖాదర్‌వలి బాషాను తనూజ వివాహం చేసుకుంది.
అప్పటి నుంచి తన పేరును ఫరహాన ఫాతిమాగా మార్చుకుంది.

ఆమె తన భర్త ఖాదర్‌వలి తో కలిసి పట్టణ శివారు డీవీఆర్‌ కాలనీలో నివసిస్తోంది. ఖాదర్‌వలి బాషా ఓ ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూల్‌లో డ్రైవర్‌గా పని చేస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనూజ రెండవ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనతో మాట్లాడటం లేదని తీవ్ర మనస్తాపం చెందిన ఫాతిమా అలియాస్ తనూజ తాజాగా బుధవారం రోజు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Exit mobile version