China: చైనాలో వింత వివాహాలు తంతు.. ఒక్కరోజు పెళ్లి కొడుకు.. తర్వాత?

పెళ్లి అన్నది పెళ్లి ఒక మధురమైన ఘట్టం. అందుకే పెళ్లి విషయంలో స్త్రీ పురుషులు అనేక రకాల కలలు కంటూ ఉంటారు. కానీ ప్రస్తుత.రోజుల్లో చాలామంది పె

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 05:39 PM IST

పెళ్లి అన్నది పెళ్లి ఒక మధురమైన ఘట్టం. అందుకే పెళ్లి విషయంలో స్త్రీ పురుషులు అనేక రకాల కలలు కంటూ ఉంటారు. కానీ ప్రస్తుత.రోజుల్లో చాలామంది పెళ్లిళ్లు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా చాలా మంది ఉన్నారు. కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఇందులో ఉన్నారు. చాలామంది పెళ్లిళ్లు కాలేదు, ఎన్ని సంబంధాలు చూసిన సరిపోడం లేదు అని సూసైడ్లు చేసుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి వారి కోసం చైనాలో ఒక వినూత్న వివాహ తంతును తీసుకువచ్చింది.

ఇంతకీ ఆ పెళ్లి తంతు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఒ‍క్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గడిచిన కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది.ఈ మధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా ‍పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు.
ఇటీవల కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరుతో భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్‌ పెరుగుతోంది.