Site icon HashtagU Telugu

Marri Shashidhar Reddy: బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదు!

marri shashidhar reddy

marri shashidhar reddy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే వార్తలు చక్కర్లుకొట్టాయి. దీనిపై శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని… తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత పనుల మీదే తాను ఢిల్లీకి వచ్చానని అన్నారు. తాను బీజేపీలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదని తెలిపారు.

ప్రతి నెల తాను ఢిల్లీకి వస్తూనే ఉంటానని… అయితే ఈసారి ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరిగిందని… ఇది తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.