Maratha Quota Protest: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ హింసాత్మకంగా మారుతుంది. మరాఠా అనుకూల కోటా నిరసనకారులు మంగళవారం మహారాష్ట్రలోని పూణె నగరంలో ముంబై-బెంగళూరు హైవేను దిగ్బంధించి టైర్లు తగలబెట్టారు.
వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో రిజర్వేషన్లు కోరుతూ మరాఠా కమ్యూనిటీ సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ముంబై-బెంగళూరు హైవేపై నవాలే వంతెన వద్ద నిరసనకారులు రోడ్డుని దిగ్బంధించారు. మరాఠాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రోడ్లపై ఏడు నుండి ఎనిమిది టైర్లకు నిప్పంటించారు. దీంతో వాహనాల రాకపోకలను తొలుత నిలిపివేశామని తర్వాత పాక్షికంగా పునరుద్ధరించామని సిన్హ్‌గడ్ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మరోవైపు పుణెలోని మరాఠా వర్గానికి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లు, కార్యాలయాల వెలుపల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరాఠా కమ్యూనిటీకి చెందిన రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాల వెలుపల భద్రతను పెంచామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా రామస్వామి తెలిపారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరాఠాకు మద్దతుగా పలు సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేయడంతో రాష్ట్రంలోని పలు చోట్ల మరాఠా ఆందోళన హింసాత్మకంగా మారింది. బీడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
Also Read: చంద్రబాబు బెయిల్ రావడం తో బండ్ల గణేష్ సంతోషంతో టపాసుల మోత