Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన

మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.

Published By: HashtagU Telugu Desk
Maoists

Maoists

మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.

2 డిసెంబర్ 2000 సంవత్సరం నాడు మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఆవిర్భవించిందని, గెరిల్లా సైన్యానికి 20 ఏళ్ళు పూర్తయ్యాయని, 20 ఏళ్ల వేడుకల సందర్భంగా సావనీర్ ను విడుదల చేస్తున్నామని అభయ్ తెలిపారు.

20 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి అనేక మంది మావోయిస్టులు అమరులైనారని,
అమరులైన మావోయిస్టులందరికి విప్లవ జోహార్లు తెలియచేస్తున్నామని, PLGA 2003 నుండి అనేక సాయుధ పోలీసు ఉద్యమాలను ఎదుర్కొంటు ప్రజలకోసం నిలబడిందని,భారత పాలక వర్గాలు కొనసాగిస్తున్న అణచివేత పై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నామని అభయ్ తెలిపారు.

2005 జూన్ నుండి 2009 అనేక క్యాంపెన్ల తో తలపడి, 2009 లో కేంద్రం తలపెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ తో దాదాపు 9 ఏళ్ళ పాటు పోరాటం చేసి గ్రీన్ హంట్ ను తిప్పికోట్టిందని, మే 2017 కేంద్రం తలపెట్టిన నక్సల్ నిర్ములన వ్యతిరేక క్యాంపెన్ల ను తిప్పికోట్టి,
ప్రపంచ నెంబర్ వన్ శత్రువు అమెరికా కనుసన్నల్లో మావోయిస్టు పార్టీపై కేంద్రం జరిపిన దాడులను తిప్పికొట్టామని ఆయన తెలిపారు.

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి మావోయిస్టు పార్టీ తరపున విప్లవాభివందనాలు తెలిపిన అభయ్ తాజాగా జరిగిన కేంద్ర దాడుల్లో 36 ఎన్ కౌంటర్లలో 53 మంది విప్లవ కారులు మరణించారని, 17 బూటకపు ఎన్ కౌంటర్లలో 20 మంది విప్లవ ప్రజలు అసువులు బాసారని,
ఇటీవల జరిగిన ప్రజా యుద్ధ ప్రతి ఘటనలో దండ కారణ్య ప్రత్యేక కమిషన్ అందించిన నివేదిక ప్రకారం 8 మాసాల ప్రతి ఘటనలో 90 మంది పోలీసులు మరణించారని, 259 మంది పోలీసులు గాయపడ్డారని ప్రకటించారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 26న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల ముఖ్యమంత్రులతో, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారని తమకు సమాచారం ఉందని, మావోయిస్టులను కూకటి వేళ్ళతో మట్టుపెట్టాలని మోడీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తు అణచివేత పథకాన్ని రూపొందించారని అభయ్ తెలిపారు.

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని,
దేశ విదేశాల్లో ఉన్న విప్లవ కారులు, విపక్ష శక్తులు, సామ్రాజ్య వాద వ్యతిరేక శక్తులు గతం కన్నా మరింత దృఢ సంకల్పంతో ముందుకు రావాలి కోరుతున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

  Last Updated: 24 Dec 2021, 10:22 PM IST