Site icon HashtagU Telugu

Maoists: చెర్లలో పోలీసుల‌పై మావోయిస్టుల కాల్పులు

maoists naxals

maoists naxals

కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో పోలీసుల‌పై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. పోలీసుల‌ని గుర్తించిన మావోయిస్టు చెర్ల ఏరియా ఎల్‌జీఎస్‌ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌ రాజేష్‌, మరో ఇద్దరు దళ సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. మండల పరిధిలోని కిష్టరంపాడు, బత్తినిపల్లి గ్రామాల్లో మట్టి మూటలు, ట్రాక్టర్లను ధ్వంసం చేసేందుకు మావోయిస్టు యాక్షన్ టీమ్ యత్నిస్తున్నట్లు చెర్ల సీఐ బీ అశోక్‌కు పక్కా సమాచారం అందిందని జిల్లా పోలీసులు తెలిపారు. సీఐ, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసు బృందాన్ని గుర్తించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపి బత్తినపల్లి వైపు పారిపోయారు. పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టగా బత్తినపల్లి వద్ద మావోయిస్టులు మరోసారి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. వాహనాలకు నిప్పు పెట్టి డీజిల్ కోసం ఎదురు చూస్తున్న మావోయిస్టు యాక్షన్ టీమ్ పోలీసులకు చిక్కింది. అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకునేందుకు యాక్షన్ టీమ్‌లు చెర్ల అడవుల్లో తిరుగుతున్న‌ట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం. పోలీసులపై కాల్పులు జరిపిన యాక్షన్ టీమ్‌ను గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Cover Photo: File

Exit mobile version