Site icon HashtagU Telugu

Maoists:పోలీసుల ముందు లొంగిపోయిన‌ మోస్ట్ వాండెట్ మావోయిస్టు హిడ్మా

maoists

maoists

మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు మ‌డావి హిడ్మా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన హిద్మాజ‌న జీవ‌ర స్ర‌వంతిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

CRPF అధికారులు ప్రద్యుమ్న్ కుమార్ సింగ్,బిష్ణు చరణ్ మునకియా మద్దతుతో పోలీసుల ఎదుట హిడ్మా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నుంచి వేధింపులు రావడంతో పార్టీ నుంచి వైదొలిగి పోలీసుల ఎదుట లొంగిపోవాలని హిడ్మా నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హిడ్మా 16 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరారు. 2018లో మావోయిస్టు పార్టీ యొక్క విప్లవ పీపుల్స్ కమిటీ (RPC) సభ్యుడు అయ్యారు. ప‌లు ఆప‌రేషన్ లో హిడ్మా క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. హిడ్మాపై దాదాపు 7ల‌క్ష‌ల రివార్డు ఉంది.