Site icon HashtagU Telugu

Blast in Jharkhand: మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి

Blast

Blast

జార్ఖండ్‌లోని కొల్హన్ డివిజన్‌లోని సరందాలో నక్సలైట్ల (Maoist) పేలుడులో గంగి సూరిన్ అనే అమాయక మహిళ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఆమె గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాహటు నివాసి. కోల్హాన్ డివిజన్‌లోని అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల్లో నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో ఆమె అటుగా వెళ్లడంతో చనిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన బాంబుల (Land Mine) వల్ల ఏడుగురు గ్రామస్థులు చనిపోయారు. మూడు నెలల్లో సుమారు డజను మందుపాతర పేలుళ్ల సంఘటనలు జరిగాయి.

గోయిల్‌కెర పోలీస్‌స్టేషన్‌, ముఫాసిల్‌ పోలీస్‌స్టేషన్‌ (Police Station) సరిహద్దులో ఉన్న మరదిరి జంగిల్‌ ఫారెస్ట్‌కు కలపను తీసుకురావడానికి వెళుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో, ఆమె నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలడంతో అక్కడికక్కడే చనిపోయింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్స్ నిత్యం కూంబింగ్ చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు (Maoist) పోలీసులను ప్రతిఘటించేందుకు మందు పాతరలు అమర్చుతున్నారు. పాందు పాతరల కారణంగా మూగ జీవాలతో పాటు అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వికలాంగులుగా మారారు.

Also Read: Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటి అలియా, ఉత్తమ నటుడు రాజ్ కుమార్!