Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి. భద్రతా బలగాలు కీలక మావోయిస్టు నేతలను ఒక్కొక్కరిగా చిత్తు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ ఇటీవల ఓ సంచలనాత్మక లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో వారు జూన్ 10న భారత్ బంద్ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు కారణంగా, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) మృతి చెందడాన్ని పేర్కొన్నారు.
India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం
మావోయిస్టులు అభయ పేరుతో విడుదల చేసిన లేఖలో, బసవరాజు మరణాన్ని ‘రాష్ట్ర ప్రాయోజిత హత్య’గా అభివర్ణించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా బసవరాజు మృతి విషయాన్ని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. బసవరాజుపై రూ.1.5 కోట్లు బహుమతి కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా బలగాలు మావోయిస్టుల అఘాయిత్యాలకు చెక్ పెడుతూ, వన్యప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. అబూజ్‌మడ్ అడవులు, మావోయిస్టుల ప్రధాన కేంద్రంగా ఉండగా, ఇప్పుడు ఆ ప్రాంతాలకూ భద్రతా బలగాలు చొచ్చుకెళ్లి కూబోయల ఆధిపత్యాన్ని చెదరగొడుతున్నాయి. దీంతో దేశంలోని ఎర్రదళాల వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.