TBJP Secret Operation: బీజేపీ ‘సీక్రెట్’ ఆపరేషన్ షురూ!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ఎప్పుడైతే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిషా ను కలిశారో ఒక్కసారిగా వేడెక్కాయి.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 12:28 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ఎప్పుడైతే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేంద్ర హోం మంత్రి అమిషా ను కలిశారో ఒక్కసారిగా వేడెక్కాయి. రాజగోపాల్ రెడ్డి వ్యవహరంతో ప్రధాన పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఆయన బీజేపీ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ప్రత్యక్ష రాజకీయాలకు సై అంటున్నాయి. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు ఆపరేషన్ మొదలుపెట్టగా, ఇక బీజేపీ మాత్రం తెలివిగా, రహస్యంగా కార్యాచరణ మొదలుపెట్టింది. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకుని, తద్వారా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకొని తెలంగాణలో కేసీఆర్ కు తామే ప్రధాన ప్రతిపక్షం అని చాటేలా సీక్రెట్ ఆపరేషన్ షురూ చేసింది.

కాంగ్రెస్ పార్టీ చిన్న చితక నాయకులను పార్టీలో చేర్చుకుంటుంటే, బీజేపీ మాత్రం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేర్చుకొని సఫలమైంది. ఇతర జిల్లాలతో పొలిస్తే నల్లగొండ జిల్లాలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. అందుకు బీజేపీ బలమైన లీడర్లపై గురిపెట్టింది. ఇందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డితో తమ ఆస్త్రాలు ఉపయోగించబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై ఎగురుబావుటా వేసిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరికల కమిటీగా నియమితులైన విషయం తెలిసిందే. ఈటల రహస్యంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ‘ప్రజల గోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్థానిక టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌ ఆదేశిస్తే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. చాలా మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు తనతో నిత్యం టచ్‌లో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుపొందినా చివరకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరతారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.