Stephen Raveendra: నిషేధిత డ్రగ్స్ వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలు: సైబరాబాద్ సీపీ

The Narcotic Drugs and Psychotropic Substances act, 1985 procedural Handbook ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,  ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ.. NDPS యాక్టు కేసులను దర్యాప్తు చేసే అధికారులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా NDPS Actకి సంబంధించిన ముఖ్యమైన లీగల్ ప్రొవిజన్స్, ఇన్వెస్టిగేషన్ పద్ధతులు మరియు ప్రక్రియలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ […]

Published By: HashtagU Telugu Desk
Ravindra

Ravindra

The Narcotic Drugs and Psychotropic Substances act, 1985 procedural Handbook ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,  ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ.. NDPS యాక్టు కేసులను దర్యాప్తు చేసే అధికారులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా NDPS Actకి సంబంధించిన ముఖ్యమైన లీగల్ ప్రొవిజన్స్, ఇన్వెస్టిగేషన్ పద్ధతులు మరియు ప్రక్రియలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కు సంబంధించి దర్యాప్తు అధికారుల కోసం ఆచరణాత్మకమైన అందించడమే లక్ష్యంగా ఈ పుస్తకం రాయడం జరిగిందన్నారు. సమాజంలో నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల వినియోగం పెరుగుదల ఆందోళన కలిగించే విషయమన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలున్నాయన్నారు. ముఖ్యంగా ఇవి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. మతిమరుపు/ జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం, ఇమ్యూన్ సిస్టం దెబ్బతినడం, బిహేవియరల్ మార్పులు, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీ కి దారి తీస్తాయన్నారు. కావున NDPS Act ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఈ Act ను అతిక్రమించి డ్రగ్స్ ను వినియోగించే వారిని చట్టం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. వీరికి జీవిత కాలపు జైలు శిక్ష, డెత్ పెనాల్టీ పడే అవకాశం ఉందన్నారు. NDPS చట్టం యొక్క తీవ్రత ఉన్నప్పటికీ.. తాజా కోర్టు తీర్పులు, నియమాలు, పరిశోధనా విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి.

అలాగే భవిష్యత్తులో జరిగే నేరాలను అరికట్టడానికి ముందస్తుగా సరైన విధానాలు, సమగ్రమైన మరియు ఖచ్చితమైన దర్యాప్తు చాలా ముఖ్యమైనదన్నారు. ఎన్‌డిపీఎస్ కేసు కు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, స్వాధీనం చేసుకున్న వస్తువులను మల్ఖానాలో డిపాజిట్ చేయడం, సీనియర్ అధికారులకు తెలియజేయడం, FSL కు నమూనాలను ఫార్వార్డ్ చేయడం, FSL నివేదికలను సేకరించడం, ఛార్జ్ షీట్‌లను దాఖలు చేయడం వంటి అన్ని కీలక అంశాలను ఈ పుస్తకం కవర్ చేస్తుందన్నారు.

Also Read: MLC Kavitha: సాయిచంద్ భార్యకు ప‌రామ‌ర్శ‌.. కవిత కంటతడి

  Last Updated: 06 Jul 2023, 05:59 PM IST