Site icon HashtagU Telugu

Hyderabad : హైదరాబాద్‌లో నేడు ప‌లు పాఠశాలలకు సెల‌వు.. కార‌ణం ఇదే..?

Govt Schools

Govt Schools

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కారణంగా నగరంలో ట్రాఫిక్‌ని మ‌ళ్లించారు. ర‌ద్దీ దృష్ట్యా సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోవెన్‌పల్లి తదితర ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెలవు ప్రకటించారు. అనేక పాఠశాల యాజమాన్యాలు బుధవారం భారత్ జోడో యాత్ర కారణంగా ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు సెలవు ప్రకటిస్తున్నామ‌ని విద్యార్థుల‌కు త‌ల్లిదండ్రుల‌కు తెలిపారు.