Site icon HashtagU Telugu

PM Kisan Scheme: ఏపీలో రైతుల‌కు అంద‌ని పీఎం కిసాన్ ప‌థ‌కం

PM Kisan scheme

PM Kisan scheme

ఏపీలో చాలా మంది రైతులు పీఎం కిసాన్ ప‌థ‌కం అంద‌డంలేద‌ని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో దాదాపు 15.2 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని అందించే కేంద్ర ప్రాయోజిత ‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద చెల్లింపు వాయిదాలు లేకుండా ఉన్నాయి. పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ సంవత్సరానికి రూ.6,000 చొప్పున మూడు విడతలుగా రూ. 2,000 అందుకుంటారు.అయితే 10వ విడత బదిలీ జనవరి 1 నుండి జరుగుతోంది.ఈ ప‌క్రియ‌ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతుంది.
దేశంలో పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు, సామాజిక శాస్త్రవేత్తల బృందం ప్రాతినిధ్యం వహిస్తున్న LibTech నిర్వహించిన సర్వే ప్రకారం.. పీఎం కిసాన్ కింద నమోదైన మొత్తం 59, 06,097 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ.96,03.3 కోట్లు కేటాయించాలి. రైతులకు దాదాపు రూ. 82,03.7 కోట్ల చెల్లింపులు అందగా.. 15.2 లక్షల మంది రైతులకు 13,43.5 కోట్ల రూపాయల చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే వీరికి మినహాయింపుకు ఉదహరించబడిన కారణాలు ప్రధానంగా సంబంధిత బ్యాంకు లేదా ఆధార్ ధృవీకరణ సమస్య ద్వారా ఈ ప‌థ‌కం అంద‌డంలేద‌ని నివేదికి పేర్కొంది. ఖాతా చెల్లింపులు, ఆధార్ చెల్లింపుల ద్వారా డబ్బు బదిలీ చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో, సాంకేతిక సమస్యల కారణంగా రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడిన మొత్తం జమ చేయబడదు. ఆధార్ చెల్లింపు వ్యవస్థలో, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మ్యాపింగ్ సంబంధిత సమస్యల కారణంగా తిరస్కరణలు జరుగుతాయి.

పీఎం కిసాన్ డేటాబేస్‌లో, చెల్లింపులు ఎందుకు నిలిపివేయబడతాయో స్పష్టంగా పేర్కొనలేదు. రైతులు సమస్యను పరిష్కరించలేకపోవడానికి.. వారి చెల్లింపులను స్వీకరించలేకపోవడానికి కారణం” అని లిబ్‌టెక్ ఇండియాకు చెందిన అజయ్ పల్లె స్వేరో తెలిపారు. జూలై 2021లో బ్యాంక్ తిరస్కరణస‌, ఆధార్ ధృవీకరించబడని కేసులు ఎదుర్కొంటున్న 33,562 రైతుల కేసులను నిశితంగా పరిశీలించగా, గత ఆరు నెలల్లో కేవలం 12.5% ​​కేసులు మాత్రమే పరిష్కరించబడ్డాయని నివేదిక పేర్కొంది. ఈ కేసుల్లో కొన్ని 1,060 రోజులకు పైగా పరిష్కారం కోసం వేచి ఉన్నాయని సంస్థ‌కు చెందిన చక్రధర్ బుద్ధ తెలిపారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఖాతా చెల్లింపు కేసులకు నిర్దిష్ట తిరస్కరణ కారణాన్ని బట్టి బ్లాక్ అధికారులు రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను పీఎం కిసాన్ లాగిన్‌లో అప్‌డేట్ చేయాలి. ఆధార్ చెల్లింపు కేసుల్లో బ్యాంకులతో DPT కోసం NPCI మ్యాపింగ్‌ను సులభతరం చేయాలి. వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను రూపొందించి, వాటిని లబ్ధిదారులకు అందజేయడానికి వాటిని ఫ్రంట్‌లైన్ అధికారులతో పంచుకోవాల‌ని సంస్థ ప్ర‌తినిధి నవీన్ గజ్జలగారి వివ‌రించారు. చెల్లింపులు ఎందుకు నిలిపివేయబడతాయో శాఖ కారణాలను ప్రచురించి.. పరిష్కార ప్రక్రియను పేర్కొనాల‌ని నివేదిక పేర్కొంది.