Vijay Sethupathi: రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకుల కలలు నిజం

  • Written By:
  • Updated On - June 11, 2024 / 12:09 AM IST

Vijay Sethupathi: రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కలలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి అన్నారు. రామోజీరావు విజన్‌కు ఫిల్మ్ సిటీ నిదర్శనమని పేర్కొన్నారు. ఓ సినిమాకు కావల్సినవన్నీ ఫిల్మ్ సిటీ రూపంలో సమకూర్చడం తనను ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విజయ్ సేతుపతి.. రామోజీరావు మరణం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వస్తే ఫిల్మ్ సిటీనే గుర్తుకు వస్తుందని చెప్పారు. 2005లో ధనుష్‌తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్‌సీకి వచ్చిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపాన్ని ప్రకటించారు.

సినిమా రంగంలోనూ రామోజీ ముద్ర తక్కువేమీ కాదు. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించిన రామోజీరావు.. ఈ బ్యానర్ లో 984లోనే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీవారికి ప్రేమలేఖ, ప్రతిఘటన, నువ్వేకావాలి, చిత్రం సినిమాలు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన టాప్ సినిమాలు. తరుణ్ హీరోగా వచ్చిన నువ్వేకావాలి సినిమా అయితే అప్పట్లో యూత్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.