Trisha: త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గారు నటుడు మన్సూర్. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నా.” అని తెలిపారు. త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా.. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నానని లియో సినిమాకు సంబంధించి మన్సూర్ వ్యాఖ్యలు చేశారు.
చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదన్నారు మన్సూర్. ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. టాలీవుడ్, కోలీవుడ్ నటులు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో ఎట్టకేలకు నటుడు మన్సూర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. ఈ వ్యవహరంతోనైనా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పుడుతుందో లేదా చూడాల్సిందే.
Also Read: Vizag Fishing Harbour : ఉప్పు చేప ఫ్రై ..40 బోట్లను కాల్చేసింది