Rahul Gandhi: మణిపూర్ లో రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

మణిపూర్ హింసాత్మక ఘటనలో నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటించారు. అయితే మణిపూర్ బిష్ణుపూర్ వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Rahul Gandhi: మణిపూర్ హింసాత్మక ఘటనలో నేపథ్యంలో రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన చేపట్టారు. అయితే మణిపూర్ బిష్ణుపూర్ వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ లో సహాయ శిబిరాలను సందర్శించడానికి వెళుతున్న రాహుల్ ను పోలీసులు అడ్డగించారు. దీనిపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. హింసాత్మక ఘటనలో భాగంగా రాహుల్ గాంధీకి రక్షణ కల్పించేందుకే కాన్వాయ్ ని అడ్డుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సమీపంలో నిరసనకారులు హైవేపై టైర్లు తగులబెట్టారని, కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని అధికారులు పేర్కొన్నారు. అందుకే ముందుజాగ్రత్తగా కాన్వాయ్‌ని బిష్ణుపూర్‌లో ఆపమని అభ్యర్థించామని చెప్పారు.

మణిపూర్ జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయ్ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్రతో మే 3న ఘర్షణలు చెలరేగాయి. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వారు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు – నాగాలు మరియు కుకీలు అక్కడ జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వారు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

Read More: Dr VRK Womens College: డాక్టర్ VRK మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీట్లు