Asian Table Tennis: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా..!

బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కప్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో భారత ప్లేయర్‌ మనిక బాత్రా సంచలనం నమోదు చేసింది.

  • Written By:
  • Updated On - November 19, 2022 / 04:34 PM IST

బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కప్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో భారత ప్లేయర్‌ మనిక బాత్రా సంచలనం నమోదు చేసింది. ఈ విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్న ఆమె.. తొలి పతకం అందుకున్న భారత మహిళగా రికార్డు సృష్టించింది. మనిక 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2 స్కోరు తేడాతో విజయం సాధించగా.. జపాన్‌కు చెందిన హనా హయతను 4-2 పాయింట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌లో మిమా ఇటో చేతిలో 2-4 (8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11) తేడాతో ఓడిపోయింది. ఆమె ఓడిపోయినప్పటికీ కాంస్య పతక మ్యాచ్‌లో ఆడి మెడల్ ను కైవసం చేసుకుంది.

గురువారం థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో మొదటి రౌండ్‌లో చైనాకు చెందిన ప్రపంచ నం. 7 చెన్ జింగ్‌టాంగ్‌పై విజయాన్ని నమోదు చేసేందుకు బాత్రా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. హువామార్క్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలో వరల్డ్ నం.44 ర్యాంకర్ బాత్రా 4-3 (8-11, 11-9, 11-6, 11-6, 9-11, 8-11, 11-9)తో నాలుగో సీడ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ను ఓడించింది. దీంతో క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. QFలో ఆమె 4-3 (6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9)తో తైవాన్‌కు చెందిన చెన్ జు-యును ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆసియా కప్ ప్రస్తుత ఎడిషన్ నవంబర్ 17 నుండి నవంబర్ 19 వరకు బ్యాంకాక్‌లోని హుమార్క్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది.