Site icon HashtagU Telugu

Vishnu: మంచు ఫ్యామిలీ త‌గ్గేదేలే!

Jagan Vishnu

Jagan Vishnu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, మంచు విష్ణు ఇటీవ‌ల క‌లిసిన సంగ‌తి తెలిసిందే. అంత‌క ముందే, ఏపీలో సినిమా ట‌కెట్ రేట్లు, ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, మెగాస్టార్ చిరంజీవి ఆద్వ‌ర్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు జగ‌న్‌తో స‌మావేశం కావ‌డం, ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌డం అన్ని ఒకేరోజు జ‌రిగిపోయాయి. అయితే ఆ త‌ర్వాత మంచు విష్ణు వెళ్ళి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలపై, సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన సినీ ప్ర‌ముఖుల్లో చిరంజీవితో పాటు మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌దితులు ఉన్నారు. అయితే ఈ స‌మావేశానికి తండ్రి మోహ‌న్ బాబుకు స‌రైన ఆహ్వానం అంద‌క‌పోవ‌డంతో, మ‌రోసారి మెగా అండ్ మంచువారి మ‌ధ్య కోల్డ్ వార్ స్టార్ అయ్యింది. స‌హ‌జంగానే మంచు వారి ఫ్యామిలీ ఎక్క‌డా త‌గ్గేదేలే అంటారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ వ‌ద్ద‌కు సినీ ప్ర‌ముఖులు వెళితే, మంత్రి పేర్ని నానిని ఏకంగా త‌న ఇంటివ‌ద్ద‌కే పిలుపించుకుని త‌న రూటే స‌ప‌రేటు అని మోహ‌న్ బాబా నిరూపించుకున్నారు. త‌ర్వాత విష్ణు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంతో, టాలీవుడ్‌లో మెగా వ‌ర్సెస్ మంచు, రెండు ఫ్యామిలీల మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ తీవ్ర‌స్థాయికి చేరుకుంద‌ని సినీ వ‌ర్గాల‌ల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక కొన్ని నెల‌ల క్రితం మా అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ పై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. దీంతో మా అసోషియేష‌న్‌లో ఉన్న ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గం మంచు విష్ణును టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలో త‌న‌కు బంధువైను సీఎం జ‌గ‌న్‌ను, విష్ణు క‌ల‌వ‌డంతో సినీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ‌కు తెర‌లేపింది.