Manchu Family Controversy: మంచు కుటుంబ వివాదంలో, నటుడు మనోజ్ మంచుపై హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులను మంజూరు చేసింది. యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై విష్ణు మంచు గురించి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మనోజ్ కు ఉత్తర్వులు జారీ చేసింది.
మంచు కుటుంబంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, మంచు మనోజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో, ఆ వ్యాఖ్యలు విష్ణు మంచుకు బాధ కలిగించాయని, ఆయన ప్రతిష్టకు హాని కలిగించాయని, అలాగే విష్ణు పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడాడని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. విష్ణు సమర్పించిన సాక్ష్యాలను సమీక్షించిన అనంతరం, అతని వ్యక్తిగత సమగ్రతను దృష్టిలో పెట్టుకొని, విష్ణు మంచు ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను నిరోధించేలా కోర్టు తీర్పును ఇచ్చింది.
Affadavit
మరోవైపు, మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలని కోరుతూ మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది. అప్పుడే ఏదైనా తేల్చుతాం అని తెలిపిన కోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.