Viral Video: క్యాన్సర్ వల్ల పోయిన కన్నుని ఫ్లాష్ లైట్ గా మార్చుకున్న వ్యక్తి?

సాధారణంగా చాలామంది క్యాన్సర్ పేషెంట్ లు వారికి క్యాన్సర్ వచ్చింది అని దిగులు పెట్టుకొని వారిలో వారే

  • Written By:
  • Publish Date - October 27, 2022 / 06:40 PM IST

సాధారణంగా చాలామంది క్యాన్సర్ పేషెంట్ లు వారికి క్యాన్సర్ వచ్చింది అని దిగులు పెట్టుకొని వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. కొందరు మాత్రం ఆ క్యాన్సర్ ను ఎదురించి క్యాన్సర్ పేషెంట్లకు ఆ క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి క్యాన్సర్ పై స్పందించిన తీరు కూడా నెటిజన్స్ ని ఆశ్చర్య పరుస్తోంది. క్యాన్సర్ కారణంగా కంటిని కోల్పోయిన ఒక వ్యక్తి దానిని అవకాశంగా మార్చుకొని క్యాన్సర్ పై విభిన్నంగా కళ్ళు చెదిరే రీతిలో స్పందించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యుఎస్ కు చెందిన బ్రియాన్ స్టాన్లీ అనే వ్యక్తి క్యాన్సర్ కారణంగా తన కుడికన్ను ను కోల్పోయాడు. ఆ కుడి కన్ను స్థానంలో ఐప్యాచ్, కృత్రిమ కన్ను కొనుగోలు చేయడానికి బదులుగా తన కుడి కన్నును ఫ్లాష్ లైట్ గా మర్చి ఫ్లాష్ లైట్ గా పనిచేసే ప్రొస్తెటిక్ కంటిని సృష్టించాడు. ఆ కుడి కన్ను స్థానంలోకి టెర్మినేటర్ అనే ఒక గాడ్జెట్ ను కూడా చొప్పించాడు. ఈ నేపథ్యంలోని తాజాగా ఆ కన్ను ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో అతను నేను క్యాన్సర్ కారణంగా ఒక కన్నును కోల్పోయాను.

 

అందుకే ఈ పరికరాన్ని తయారు చేసి నా తలను ఒక ఫ్లాష్ లైట్ గా మార్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే చీకటి గదిలో ఈ లైట్ ఏ విధంగా పని చేస్తుంది అన్నది బిర్యాని ఒక వీడియోని కూడా షేర్ చేశాడు. అయితే అతడు అమర్చుకున్న ఆ ఫ్లాష్ లైట్ ఒక్కసారి చాట్ చేస్తే 20 గంటల పాటు మంచి కాంతిని అందిస్తుందట. అంతేకాకుండా ఎంత వాడినా కూడా అది వేడెక్కదట.