నిజాంపేట్‌లో దారుణం జరిగింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. రాజేష్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎవరు లేని సమయంలో… తన చావు కారణం లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే బాధలే నని బోర్డుపై సూసైడ్ నోట్ రాశాడు. తరువాత ఇంట్లో ఫ్యాన్ కుఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తన భార్యకు సారీ చెప్తూ లోన్ యాప్ వాళ్లు తనకు అసభ్యకరమమైన ఫోటోలు పెట్టి వేధించారని ఇక తనకు బ్రతకాలని లేదని రాశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి.. బోర్డుపై సూసైడ్ నోట్

loan app