Site icon HashtagU Telugu

Maharashtra : మ‌హారాష్ట్రలో రైలు కింద ప‌డి వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌

Deaths

Deaths

మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద ప‌డి ఓ వ్యక్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సెంట్రల్ రైల్వే మెయిన్ లైన్‌లోని అంబర్‌నాథ్ – బద్లాపూర్ స్టేషన్‌ల మధ్య ఈ ఘటన జరిగింది. మృతుడు గిరీష్ నంద్‌లాల్ చుబేగా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో సూసైడ్ నోట్ ల‌భ్య‌మైంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఇద్దరు సహోద్యోగులు అతని గురించి సంస్థ యజమానికి ఫిర్యాదు చేయడంతో అతను ఉద్యోగం కోల్పోయినట్లు వివరించిన వీడియో క్లిప్‌ని పోలీసులు గుర్తించారు. క్లిప్‌లో ఆ వ్యక్తి తాను ఉద్యోగంలో లేనందున కొంతమంది నుండి లక్ష రూపాయలు తీసుకోవలసి వచ్చిందని.. డబ్బు ఇచ్చేవారు తనను వేధిస్తున్నారని మృతుడు తెలిపాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్‌లో మనీ లెండర్లు, ఇద్దరు సహోద్యోగుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version