Site icon HashtagU Telugu

Suicide : ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం చేస్తుకున్న‌ వ్యక్తి.. ర‌క్షించిన ఢిల్లీ పోలీసులు

Suicide Hanging 19

Suicide Hanging 19

ఢిల్లీలో ఓ వ్య‌క్తి త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌యత్నించాడు. అయితే అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునేది ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టాడు. ఈ విష‌యం ఆ వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వాళ్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి స‌మాచారం అందించారు. ఒంటరిగా నివసిస్తున్న తన తమ్ముడు ఆత్మహత్యాయత్నాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కాల్‌కు ప్రతిస్పందనగా.. ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తన బృందంతో కలిసి సాంకేతిక వివరాలను సేక‌రించారు. ఆ తర్వాత ఛోటా ఠాకూర్ ద్వారా.. షాహదారా వద్ద ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని వెంటనే రక్షించారు. అతను బ్లేడ్లు ఉపయోగించి అతని చేతులపై గాయాలు చేసుకున్నాడ‌ని.. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామ‌ని పోలీసులు తెలిపారు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలే ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు గ‌ల కార‌ణాలు అని పోలీసులు తెలిపారు.